పి పి పి విధానం రద్దు చేసే వరకు పోరాటం ఆగదు..
ఎస్సీ ,ఎస్టీ, బీసీలకు వైద్య విద్య ను దూరం చేయొద్దు.
అఖిల పక్ష , ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం
త్రినేత్రం న్యూస్, కాకినాడ,డిసెంబర్,13: ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను పి పి పి పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు సీపీఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్ణిక ఫంక్షన్ హాల్ లో శనివారం ఉదయం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సీపీఐ, సీపీఎం , కాంగ్రెస్ వైఎస్ ఆర్ సి పి, ఆమాద్మీ పార్టీ, బీఎస్పీ , జై బీమ్ పార్టీ, 19 ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేసం లో ముందుగా కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు , మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రంగాన్ని ఖూనీ చెయ్యొద్దని, ఎస్సీ ఎస్టీ బీసీలకు వైద్య విద్యను దూరం చేయొద్దని, వైద్య రంగాన్ని PPP పేరుతో ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.గత ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మెడికల్ కాలేజీలు నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టిందని, మెడికల్ కాలేజీకి ప్రభుత్వ ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించిందని మెడికల్ కాలేజీ లన్ని ప్రభుత్వంలోనే కొనసాగించిందని కానీ నేడు అధికారo లోకి వచ్చిన కూటమి కూటమి ప్రభుత్వం 17 మెడికల్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని, ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్వహించక పోతే రాజీనామాలు చేసి గద్దె దిగాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులను ప్రైవేటీపరం చేస్తే ప్రజల అగ్రహానికి తట్టుకోలేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుటుంబాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని నాణ్యమైన విద్య వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వం పార్టీ ప్రయోజనాల కొరకు కు అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేస్తుంది అవి చేసినా చెయ్యకపోయినా పేద వాళ్లకు వైద్యం మాత్రం దూరం చేయొద్దని ఇప్పటికే ప్రభుత్వసామాన్య, వైద్య విధాన, ఏరియా, సిహెచ్ సి , పీహెచ్ సీ ఆసుపత్రులలో మందులు కొరత , పరికరాలు , సిబ్బంది తీవ్రంగా ఉందని, అటువంటిది ప్రభుత్వ కాలేజీలో ప్రైవేటుపరం చేస్తే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారని దీనివల్ల మధ్యతరగతి పేద ప్రజలకు తీవ్రతర ఇబ్బందులు వస్తాయని ప్రజారోగ్యం రంగం నుంచి నాణ్యమైన వైద్యని ఒక హక్కుగా పొందే అవకాశాన్ని ప్రజలు కోల్పోతారని ప్రైవేట్ నియంతనం వల్ల వైద్య చికిత్సలు ఖరీదువుతాయని ప్రైవేటు వ్యక్తులు తమ పెట్టుబడిన రాబట్టుకోవడానికి రోగులపై అధిక భారాన్ని మోపుతారని వారు దోపిడికి గురవుతారని ఆరోగ్య విపత్తుల సమయంలో సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటారని గత కోవిడ్ సమయంలో ప్రవేటాస్పత్రులను మూసివేస్తే ప్రభుత్వాసుపత్రి మాత్రమే ఆ భారాన్ని మోసే అని అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పిపిపి విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని అనుకోవడం అత్యంత దుర్మార్గమని మధు అన్నారు ఈ విధానం సామాజిక న్యాయం విద్యార్థుల హక్కులు ఉపాధి భద్రత వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ఆయన అన్నారు ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమై సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్యని మధు తెలిపారు. సిపిఎం సీనియర్ నాయకులు దువా శేషుబాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను పిపిపి విధానంలో ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590 ను జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మెడికల్ కాలేజీల.. పి పి పి విధానం వల్ల ప్రభుత్వ భూములు భవనాలు కాలేజీల ఆసుపత్రులు దాదాపు 60 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని విమర్శించారు. దీనితో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్య అందరిని ద్రాక్ష వలె మారడమే కాకుండా వైద్య విద్యలో పారదర్శకత లోపించే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా మారిందని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా మెడికల్ కళాశాలను పి పి పి పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 590 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 107 108లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఏ దేశంలోనైనా విద్య వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉందని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ను చంద్రబాబు సామాజిక వర్గానికి తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిపిపి పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. జై భీమ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఆనాడు జగన్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నేడు వాటిని ప్రైవేటు వ్యక్తులుగా అప్పగించడం దారుణమని ఆయన అన్నారు.
ఇంకా ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కిర్ల కృష్ణ రావు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, 93 కులాల ఐక్యవేదిక నాయకులు మాదిరెడ్డి గణేష్ బాబు, గాంధీనగర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు పరస సురేష్ కుమార్, మాజీ మేయర్ ఎస్ ఎస్ శివ ప్రసన్న సాగర్, కుడా మాజీ చైర్ పర్సన్ చంద్రకళ దీప్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి రవికుమార్, ఐ ఎన్ టి యు సి ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరి రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, గాంధీ, కాకినాడ జిల్లా మార్క్సిస్ట్ మేధవులు చింతపల్లి సుబ్బారావు, పెద్దింశెట్టి రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు పలివేల వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కోనాడ బిట్టు, ఏఐవైఎఫ్ నగర కన్వీనర్ నాని, జి జి హ్ చ్ రామయ్య, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ .భవాని, గ్రంథాలయం జిల్లా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పి. సత్యనారాయణ, ప్రముఖ రొయ్యల వ్యాపారి కోమ్మర్తి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


