Ellannolla Ravinder : గ్రామ అభివృద్దే నా లక్షమ్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 11: వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామపంచాయతీ అభ్యర్థిగా ఎల్లన్నోళ్ల రవీందర్ పోటీ చేయడం జరిగింది. కొటాలగూడ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఆయన గ్రామ ప్రజలతో గ్రామ అభివృద్ధి కోసం మీ ఎల్లన్నోళ్ల రవీందర్ పాటుపడతానని గ్రామ ప్రజలకు గ్రామ యువకులకు తెలియజేయడం జరిగింది. ఆయన కొటాలగూడ గ్రామ ప్రజలకు యువతకు కొన్ని సూచనలు చేశారు. కొటాలగూడ గ్రామపంచాయతీ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చదువుకున్నావో యువతరమా ఒకసారి ఆలోచించండి. అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి కోసం మీ ఎల్లన్నోళ్ల రవీందర్ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలో అన్ని వార్డులు గల్లీ గల్లీకి వాడ వాడకి అనుసంధానిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడతాను. అలాగే మంచినీటి సరఫరా ఉన్న ప్రతి వాడకి బోరుబావి నల్ల కనెక్షన్ సమస్యలు తీరుస్తాను. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కి సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేర్చుటకు 11వేల రూపాయలు, ఒకవేళ తల్లిదండ్రులు ముందుగా చేర్చి ఉంటే వారికి కూడా జమ చేయబడును.

గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 11,000 రూపాయలు కానకగా ఇవ్వబడును. సమానాత్వమే లక్ష్యంగా అంతిమయాత్ర అవసర నిమిత్తం వైకుంఠ దామం వాహనం గ్రామపంచాయతీ పేరు ఉన్న రిజిస్ట్రేషన్ చేసి ప్రజల అందరి కోసం అందుబాటులో ఉంచుతాను. పోటీ పరీక్ష నిమిత్తం చదువుకునే యువత విద్యార్థుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో లైబ్రరీ నిర్మించి అన్ని రకాల పుస్తకాలు రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి అందుబాటులో ఉంచుతాను. గ్రామ సమస్యలను గ్రామసభ దృష్టికి పరిష్కారాలపై చర్చ కోసం ప్రతి నెల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి అందరి అభిప్రాయంతో పరిష్కారానికి చర్యలు చేపడతాను.

అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులకు ఏ అపాయం జరిగిన తత్వ తరగతి నా హాస్పటల్కి చేర్చుటకు 24/7 అందుబాటులో ఒక అంబులెన్స్ గ్రామపంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేసి అందుబాటులో ఉంచుతాను. ఓ నవతారమ్మ రేపటి బంగారు భవిష్యత్తు నిర్ణయించే అవకాశం మరియు అధికారం మీ చేతుల్లోనే ఉంది ఇది సరైన సమయం సిద్ధం కండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బంగారు భవిష్యత్తు కి బాటలు వేయండి గ్రామ అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకోండి నవ సమాజాన్ని నిర్మించండి ఉంగరం గుర్తుకు ఓటేయండి. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం. కొట్టాల గూడా గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎల్లనోళ్ల రవీందర్ గ్రామ ప్రజలకు యువకులకు మహిళా మణులకు విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Village development is my goal

You cannot copy content of this page

Scroll to Top