- అనపర్తిలో కోటి సంతకాల ఉద్యమానికి అద్భుత స్పందన
- వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక
- రెండు నెలలపాటు గ్రామాలు చుట్టి, ఇంటింటికి వెళ్లి వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల భారీ అవగాహన కార్యక్రమం
- అనపర్తి నియోజకవర్గంలో మొత్తం 60,129 సంతకాల సేకరణ
- మీడియా, ప్రజల సమక్షంలో కోటి సంతకాల పత్రాల ప్రదర్శన
- ఈ నెల 17న గవర్నర్ తో జగన్ భేటీ
త్రినేత్రం న్యూస్ : అనపర్తి నియోజకవర్గంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “కోటి సంతకాల మహాయజ్ఞం” కు ప్రజల నుండి ఉధృతమైన స్పందన లభించింది. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, పిలుపు మేరకు, అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో ఒక ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది.
క్రమబద్ధంగా రెండు నెలలపాటు నాలుగు మండలాల్లో గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రతి ఇంటిని చేరుకుంటూ పార్టీ శ్రేణులు ప్రజలకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడంతో, ఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది.
ఈ క్రమంలో అనపర్తి నియోజకవర్గంలో మొత్తం 60,129 సంతకాలు సేకరించామని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలిపారు. సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి పంపించేందుకు అనపర్తి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మీడియా, ప్రజల సమక్షంలో పత్రాలను ప్రదర్శించి, వాటిని ప్రత్యేక వాహనంలో తరలింపు కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దారుణం. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, హెచ్చరించారు.
సేకరించిన పత్రాలను ఈ నెల 15వ తేదీన జిల్లా కార్యాలయం నుండి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. తదుపరి రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఈ నెల 17వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి , గవర్నర్ కి అందజేస్తారు. ప్రజల అభిప్రాయానికి గవర్నర్,కి వివరించనున్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


