Prevention of Accidents : ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణాశాఖ దూకుడు

TRINETHRAM NEWS

అరకులోయ డిసెంబర్ 10, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామ రాజు జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, జిల్లా కలెక్టర్ ఏ‌.ఎస్‌. దినేష్‌కుమార్ మరియు జిల్లా రవాణాశాఖ అధికారి కే.వి. ప్రకాష్‌రావు ఆదేశాల మేరకు గత వారం రోజులుగా రవాణాశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో భాగంగా వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన 12 వాహనాలపై మొత్తం రూ.80,330 విలువైన చలానాలు విధించినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా చోడవరం,పాడేరు మార్గంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్న జీపులపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకున్నారు.
అధిక ప్రయాణికులను రవాణా చేయడం, అధిక ధరలు వసూలు చేయడం, ఫిట్నెస్ లేకుండా వాహనాలను నడపడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మూడు జీపులను సీజ్ చేసి పాడేరు ఏపీ.ఎస్.ఆర్టీసీ డిపోకు తరలించినట్టు రవాణాశాఖ వెల్లడించింది.
అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణభద్రతను కాపాడడం కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Prevention of accidents is the goal of the transport department

You cannot copy content of this page

Scroll to Top