Araku Coffee Production : నాణ్యమైన అరకు కాఫీ ఉత్పత్తికి కొత్త మార్గదర్శకాలు

TRINETHRAM NEWS

అరకులోయ, డిసెంబర్ 9, (త్రినేత్రం న్యూస్): అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత గుర్తింపు, రైతులకు స్థిరమైన ధర కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పలు చర్యలను ప్రారంభించినట్లు కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం కాఫీ రైతులు, ట్రేడర్లు, ఎఫ్‌పీఓలు పాల్గొన్న సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు.
కాఫీ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ట్రేడర్లు కలిసి అసోసియేషన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ చట్టబద్ధతతో పారదర్శకంగా వ్యవహారాలు సాగుతాయని చెప్పారు. రైతులు నేరుగా విక్రయించేందుకు కాఫీ రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యంత్రాల కొనుగోలుపై 30 శాతం రాయితీ అందజేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి వ్యాపారి తప్పనిసరిగా ట్రేడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందాలనీ, నాణ్యత విషయంలో రాజీ ఉండదని కలెక్టర్ హెచ్చరించారు. బెర్రీ బోరర్ నివారణపై కాఫీ బోర్డు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్టులు, డిజిటల్ తూకాల ఏర్పాటు, రెండు ఏకో పల్పింగ్ యూనిట్ల నిర్మాణం, చింతపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ద్వారా స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్లకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
జీసీసీ ద్వారా పండ్ల కొనుగోలు కొనసాగుతున్నట్లు ఐటీడీఏ పీవో శ్రీపూజ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు, కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New guidelines for quality Araku coffee production

You cannot copy content of this page

Scroll to Top