MLA Dr. Satthi : వచ్చేది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే

TRINETHRAM NEWS

మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

రాజుపాలెం గ్రామంలో ఎస్సీల మహాజన సభ త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 8, అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం, రాజుపాలెం గ్రామం, వచ్చేది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనని పార్టీ శ్రేణులంతా సమరోత్సాహంతో పని చేయాలని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పిలుపునిచ్చారు. రాజుపాలెం లంక గ్రామంలో సత్యా కల్యాణమండపం నందు ఎస్సీ సెల్ మహాజన సభ ఘనంగా జరిగింది.
నూతనంగా మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన సుందరపల్లి వీరభద్రరావు అభినందన సమావేశం; పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గోపాలపురం – రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల పరిశీలకుడు అద్దంకి ముక్తేశ్వరరావు, అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు హాజరయ్యారు.

డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చేయూత, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత పంటల బీమా తదితర అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసిందన్నారు.

నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలపై దాడులు పెరిగిపోయాయన్నారు. దోమాడలో రోడ్డు పక్కన గుడిసెలను, కుతుకులూరులో నిరుపేదలైన ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లను స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూల్చివేశారని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

రాబోయే ఎన్నికలలో జగన్ మెహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమని, దౌర్జన్యాలకు పాల్పడిన కూటమి నేతల లెక్కలు సరిచేస్తామని, ఆ దెబ్బకు అక్రమార్కులు గ్రామాలు, జిల్లాను కాకుండా రాష్ట్రాన్ని కూడా విడిచి పారిపోతారని ఆయన హెచ్చరించారు.

కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇస్తానని, అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎవరు భయపడవలసిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. మహాజన సభకు నియోజకవర్గంలో ఇంత భారీగా ప్రజలు రావడం పార్టీ అధికారంలోకి రావడానికి సంకేతమన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The next YSRCP government is

You cannot copy content of this page

Scroll to Top