Ambedkar is a Great Visionary : అంబేద్కర్ గొప్ప దార్శనికుడు

TRINETHRAM NEWS
  • అంబేద్కర్ ఆశయాలకు కృషి చేయాలి
  • అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంటి

  • త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 06,
    అనపర్తి నియోజకవర్గం,
    కుల వ్యవస్థ, అంటరానితనం అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సృష్టి ఉన్నంతవరకు ధ్రువతారగా వెలుగొందుతారని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంటి అన్నారు.

ఈరోజు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంటి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను పునాదిగా చేసుకునే వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఐదేళ్ల పరిపాలన సాగింది. భూమి, ఆకాశం ఉన్నంతకాలం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అక్కడికి విచ్చేసిన శ్రేణులు పేర్కొన్నారు.

అంబేద్కర్ భావజాలం భవిష్యత్‌ తరాలకు చేరాలనే ఉద్దేశంతో రూ.400 కోట్లు వెచ్చించి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టతో పాటు, ఆయన పేరుతో ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (పార్లమెంట్) అద్దంకి ముక్తేశ్వరావు, ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి మండా రాజారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి నాగమళ్ళ వీరభద్రరావు, వైస్ ఎంపీపీ కర్రెడ్ల వెంకన్న బాబు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి వాసంశెట్టి మాధవ,మండల ఎస్సీ సెల్ కన్వీనర్ సుందరపల్లి వీరభద్రం, గ్రామ కన్వీనర్ పెమ్మనబోయిన గోవిందరాజులు,జిత్తుక వరప్రసాద్, సోషల్ మీడియా చిట్టూరి సత్తిబాబు, ముప్పిడి సత్యనారాయణ, విప్పర్తి సుధాకర్, కనికెళ్ల సురేష్,వందే వెంకటేష్, నర్ల శీను, నీలం సత్తిబాబు, ఎల్లే సాగర్, సాంబత్తుల సురేష్, మహేంద్ర, బొంతు వెంకటేష్, వందే సునీజ్, ముప్పిడి సాయి, ముప్పిడి మారియ్య, పెంటపాటి వీర్రాజు, కొరమాటి దాసు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ambedkar is a great visionary

You cannot copy content of this page

Scroll to Top