దేవరకొండ డివిజన్ డిసెంబర్ 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనమునందు శనివారం రోజు ఉదయం 11:30 నిమిషాలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. అధ్యక్షుడు ఎన్ వీ టీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి భాస్కర్ సభ్యులతో కలిసి పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం త్యాగం చేసిన మహనీయులని మరువరాదని,డా. బి.ఆర్. అంబేద్కర్ గొప్పతనం అతని బహుముఖ ప్రతిభలో ఉందని ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, మరియు దళిత, మహిళా, కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. కుల వివక్ష నిర్మూలనకు, సామాజిక సమానత్వానికి, మరియు అణగారిన వర్గాల సాధికారతకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, చంద్రశేఖర్, శేఖర్, రాంబాబు, రమేష్, సత్యం, రవి, సుందర్ రాజకుమార్, శ్రీకాంత్, పవన్, ప్రవీణ్, ఎస్ పి ఆర్ స్కూల్ విద్యార్థులు క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


