త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 6 : మండపేట: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతినీ పురస్కరించుకొని పట్టణ పరిధిలోని 8, 9, 11 వా వార్డులు మరియు జాతీయ నాయకుల సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాలకు ఆహ్వాన కమిటీ కన్వీనర్ 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, వైయస్ఆర్సీపీ నాయకులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరిలు పూలమాలలు వేసి ఉదాహరణంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిమ్న వర్గాలకు రిజర్వేషన్లు అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. భారత రాజ్యాంగనిర్మాతగా భారత దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరంగా ఆయన్ని అభివర్ణించారు. ఆర్థిక రాజకీయ విద్యా రంగాల్లో సామాన్య ప్రజలు ముందుకు సాగాలని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని వీరు కోరారు,
ఈ కార్యక్రమంలో 11వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి కనికెళ్ల పల్లవి ప్రసాద్, 28వ వార్డు నాయకుడు మొండి మురళి, 29 వ వార్డు కౌన్సిలర్ పట్టణ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, పదో వార్డు మాజీ కౌన్సిలర్ కొల్లు వరలక్ష్మి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ కొడమంచిలి వేణు భాస్కర్, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆలీ ఖాన్ బాబా, తాతపూడి సురేష్ దార్ల, అబ్రహం, గునిపే అఖిల్, మందపల్లి లాజర్, చాపల సత్తయ్య, మందపల్లి సుధాకర్ రావు, గుమ్మడి అనిల్.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


