మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 04 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు సాగుతున్నాయి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చింతపల్లి మండలం ధైర్యపురి తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీనీ విడి
బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,మాజీ సర్పంచ్ బిచ్య నాయక్, బాల్ సింగ్,చందర్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


