MLA Anand Rao : ప్రజాదర్బార్ లో సమస్యల పరిష్కారానికి చర్యలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 04 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రజాదర్బార్ లో వచ్చిన వినతుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఆదేశాల మేరకు అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎమ్మెల్యే , కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన అర్జీలను నేరుగా ఎమ్మెల్యే ,కి సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యం వంటి పలు అంశాలకు సంబంధించిన 1030 అర్జీలను ఎమ్మెల్యే, ప్రజల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు, మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకే, ఈ ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు.
స్వీరించిన అర్జీలలో తక్షణమే పరిష్కరించదగిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. వాటి పరిష్కారం కోసం నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రజా దర్బార్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, సమస్యల పరిష్కారం కోసం తన కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆనందరావు, స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయవెంకటలక్ష్మిబాబ్జి, అమలాపురం పట్టణ టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, అమలాపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, కౌన్సిలర్ ఏడిద శ్రీను, ఆశెట్టి ఆదిబాబు, అబ్బాయి వెంకన్న, దిన్షా బాబు, దేవరపల్లి వీరేష్ కుమార్, గెల్లా మీనా కుమారి, మంథా ఫణి, నడింపల్లి ఉదయ బాబు, పచ్చిమాల ఏడుకొండలు, నల్లా చిట్టి, ఎమ్మార్వోలు, ఎండివోలు మున్సిపల్ కమిషనర్ మరియు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Steps to resolve issues in Praja Darbar

You cannot copy content of this page

Scroll to Top