Kavali News : రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 4:నెల్లూరు జిల్లా : కావలి :రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డవలప్మెంట్ అధికారి కార్యాలయాలను చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్ విధానంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు, కావలి పట్టణం 30వ వార్డు మున్సిపాలిటీ కార్యాలయం పక్కన డి.డి.ఓ కార్యాలయాన్ని అధికారులు,పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు,పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , గడిచిన సంవత్సరం కాలం పాటు రాష్ట్రం లో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతమైంది..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం.. కావలి కేంద్రంగా పది మండలాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ కార్యాలయం ద్వారానే పర్యవేక్షించబడతాయని వివరించారు.
కావలిలో నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు, కొత్త కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 2 కోట్లు 50 లక్షలు ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు..ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

77 Divisional Development Officers across the state

You cannot copy content of this page

Scroll to Top