నూతన గ్రామ సచివాలయ భవనం, సి.సి. రోడ్డు ప్రారంభించిన మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, కలెక్టర్ రాజకుమారి
నంద్యాల (డిసెంబర్ 1, 2025): నంద్యాల మండలం, భీమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం మరియు సి.సి. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం రోజున అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా విచ్చేసి, శిలాఫలకాలను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువు చేస్తుందన్నారు. ఈ నూతన భవనం ద్వారా భీమవరం ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పరిపాలన అందుబాటులోకి వస్తుందని. గ్రామ సచివాలయ భవనం మరియు ఈ నూతన సి.సి. రోడ్డు ప్రారంభంతో భీమవరం గ్రామంలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయిని . నాణ్యమైన రోడ్లు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచి, స్థానిక ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అభివృద్ధి ఫలాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని. కేవలం ప్రభుత్వమే కాకుండా, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల ఫలాలు అందాలనేదే మన కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సచివాలయాలు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక వారధిగా పని చేస్తాయన్నారు . ఈ సచివాలయం ద్వారా అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా పని చేయాలన్నారు
ఈ కార్యక్రమంలో భీమవరం టిడిపి నాయకులు టీఎస్ వెంకటేశ్వర్ రెడ్డి , అబ్దుల్ వహాబ్ , జనార్దన్ రెడ్డి , నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు , నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , మనోహర్ రెడ్డి , రామ సుబ్బారెడ్డి , మాబు సుహాని , ప్రభాకర్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , గుంతనాల నాగేశ్వరరావు , పెద్దకోటలో ప్రేమ్ కుమార్ రెడ్డి , పులిమద్ది అమర్నాథరెడ్డి , చాపిరేవుల భూపాల్ రెడ్డి , నారాయణరెడ్డి , మున్నాభాయ్ , ఆర్డీవో , ఎమ్మార్వో , ఎంపీడీవో , ఎంపీపీ మరియు మండల రెవెన్యూ అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులకు , కార్యకర్తలకు , అభిమానులకు , ప్రజలలు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


