Health Checkup Camp : ఆర్ ఎస్ ఆర్ , ఇంజనీరింగ్ కళాశాలలో, హెల్త్ చెకప్ క్యాంప్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :నవంబర్ 29: నెల్లూరు జిల్లా : కడనూతల .. బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నాడు జువ్వలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి సౌజన్యంతో బీటెక్ విద్యార్థిని విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ ను, నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.ఎన్. రెడ్డి తెలిపారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జువ్వలదిన్నె ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నిత్య ప్రశాంతి మరియు వారి సిబ్బందితో కళాశాలకు విచ్చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు.

ఈ క్యాంపు నందు విద్యార్థిని విద్యార్థులకు వైరల్ ఫీవర్, కోల్డ్, కాఫ్, సీజనల్ డిసీజెస్ అయిన చర్మవ్యాధులకు సంబంధించి అన్ని కేసులను పరిశీలించి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే వర్షాకాలంలో, చలికాలంలో వచ్చేటువంటి వ్యాధుల గురించి వాటి నివారణ గురించి విద్యార్థిని విద్యార్థులకు అవేర్నెస్ కూడా కల్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జువ్వలదిన్నె ప్రైమరీ హెల్త్ సెంటర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేస్తున్న కే. వినోద్ కన్నా తో పాటు ఆశా వర్కర్లైన శైలజ, పి.వి. శేషమ్మ మరియు లిదియా తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Health checkup camp at RSR Engineering College

You cannot copy content of this page

Scroll to Top