MLA Vasantha Krishna : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్‌

TRINETHRAM NEWS

Trinethram News : ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తునట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. జి.కొండూరు మండల పరిషత్తు కమ్యూనిటీ హాల్లో ప్రజదర్బార్‌ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి సమస్యలపై స్వయంగా ఆర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను విని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు.

మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘననివాళి

ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్న కూటమి ప్రభుత్వం.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు.

వచ్చేవారం మైలవరంలో ప్రజాదర్బారు.

రెవెన్యూ శాఖ పరిధిలోని భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నందున వచ్చే వారం జిల్లా కలెక్టరును ఆహ్వానించి మైలవరంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాదర్బారు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజదర్బార్‌ వేదికలో అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ వచ్చే సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. బాధ్యతయుతంగా పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Praja Darbar is a platform for solving public problems

You cannot copy content of this page

Scroll to Top