V.V. Jaya : అరకు ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలంటూ వి.వి. జయ డిమాండ్

TRINETHRAM NEWS

అరకులోయ, నవంబర్ 29, (త్రినేత్రం న్యూస్): స్థానిక ప్రజల ఆరోగ్య సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో, అల్లూరిజిల్లా అరకు వేలి ఏరియా ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఐద్వా జిల్లా నాయకురాలు వి.వి. జయ శుక్రవారం ఒక ప్రెస్ నోట్‌లో తెలిపారు.
ప్రతి వారం శుక్రవారం సంతకు దూర ప్రాంతాల నుండి గిరిజనులు అధిక సంఖ్యలో అరకు వేలి కేంద్రానికి చేరుకుంటారని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటో రవాణా సౌకర్యం ఎక్కువగా లభించేది శుక్రవారమే కావడంతో, అనారోగ్యంతో ఉన్న గిరిజన మహిళలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, అలాగే ఎముకల సమస్యలు, కంటి వ్యాధులు, ఇతర రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్దఎత్తున ఏరియా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో లేకపోతే, సుమారు 20 నుండి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన వైద్యులు లేదా సిబ్బంది లేని సందర్భంలో, రోగులు తిరిగి అదే దూరం వెళ్లి మళ్లీ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వైద్య సిబ్బంది ప్రతిరోజు, ముఖ్యంగా శుక్రవారం, పూర్తి స్థాయిలో హాస్పిటల్‌లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా నాయకురాలు వి.వి విజయ డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా, సిబ్బంది లోటును తీర్చాలని సంబంధిత శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

V.V. Jaya demands availability of medical staff

You cannot copy content of this page

Scroll to Top