Snake Bite : పాముకాటుతో ప్రాణం కోసం పరుగులు రోడ్డు దూరంలోనే, డోలిమోత దగ్గరలోనే

TRINETHRAM NEWS

అరకులోయ నవంబర్ 26, (త్రినేత్రం న్యూస్): బస్కి పంచాయితీ, గిరిజన గ్రామమైన బరెంగిబంద (కిల్లోగుడ) గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం మరోసారి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కిల్లోగుడకు చెందిన కిల్లో అప్పారావు (65) పాముకాటు కారణంగా ఆదివారం రాత్రి విషమస్థితిలో పడడంతో గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక, డోలిమోత సాయంతో అరకువేలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు లేకపోవడం వల్ల ఆసుపత్రికి చేరవేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురై, పరిస్థితి ఆందోళనకరంగా మారిందని స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పంచాయతీ నాయకులు సమర్డి బాబురావు మాట్లాడుతూ, “ఎన్నేళ్లుగా రోడ్డు సౌకర్యం కోసం అధికారులను కోరుతున్నా స్పందన లేదు.అభివృద్ధి పేరుతో ఈ ప్రభుత్వం ఆదివాసులను మోసం చేస్తోంది,” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకోవాలంటే పొంగిపొర్లే గడ్డలు దాటాల్సిన పరిస్థితి నెలకొని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ విద్యార్థులు బరెంగిబందకు చదువుకోడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టి గడ్డలు దాటి వెళ్లాల్సి వస్తోందన్నారు.
ఈ దుర్భర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, బరెంగిబంద,కిల్లోగుడ గ్రామానికి తక్షణం రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Running for life with snake bite, road far away, near Dolimoth

You cannot copy content of this page

Scroll to Top