Traffic Restrictions : రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్, నవంబర్ 20: తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్ భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి.. రాజ్ భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు రాష్ట్రపతి నిలయం వేదికగా నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6:15 గంటలకు ఆమె తిరిగి రాజ్ భవన్‌కు చేరుకుంటారు.

రాత్రి తెలంగాణ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ముర్ము బస చేయనున్నారు. 22వ తేదీ అంటే..శనివారం ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Traffic restrictions in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top