’జనసైనికులకు, వీర మహిళలలకు సూచించిన జనసేన పార్టీ: రాష్ట్ర నాయకులు’
కూకట్పల్లి నవంబర్ 18 (త్రినేత్రం న్యూస్) : ఈరోజు హైదరాబాద్ కూకట్‌పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షుడు రాదారం రాజలింగం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం విశేషం.ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైనవి అని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో పార్టీ బలోపేతం మరియు స్థానిక సమస్యలలో వున పరిస్థితులను విశ్లేషించాలి . ఇంటింటికి ప్రచారం ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి చేరవేయాలని సూచించారు. యువత మరియు వీర మహిళలు, కాలనీవాసులందరికీ చేరువయ్యేలా సమాజ సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అలాగే పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు, రానున్న రోజుల్లో ప్రత్యేకమైన శిక్షణ తరగతులు, కోర్ కమిటీ మీటింగ్స్, బూత్ స్థాయి సమీకరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు , మరియు పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసి, గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో వీర మహిళ ఛైర్మన్ కావ్య, జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, కుకట్ పల్లి ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ , మరియు గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ నియోజకవర్గ డివిజన్ కోఆర్డినేటర్లు , ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


