Collection of Signatures : కడియం లోమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. వైస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కడియం గ్రామంలో శెట్టిబలిజ పేట నందు వైసీపీ శ్రేణులతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిడదవోలు కొవ్వూరు అబ్జర్వర్ గిరజాల బాబు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటికరణ వ్యతిరేకంగా ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు .గిరజాల బాబు మాట్లాడుతు..వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య, విద్య దూరమవుతుందని అన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు..
కార్యక్రమంలో పార్టీ నాయకులు గుత్తుల రమేష్,లావేటీ రమేష్ , బండారు శ్రీనివాస్, వనుం పుత్రయ్య, గుత్తుల సతిబాబు, సర్కార్ బాషా, పున్నమి రాజు వీర్రాజు, కోసూరి సూరిబాబు, చెల్లుబోయిన దుర్గ ప్రసాద్,చిలుకూరు రామకృష్ణ, తోరాటి గోపి, గుత్తుల వీర్రాజు, కడియం గణేష్,శీరిగినీడి సత్తిబాబు,శాకా సతీష్,కడలి సాయి, చింతపల్లి బుజ్జి, కిర్తి సంతోష్,వనుం వెంకట రమణ,రెడ్డి హరి,బత్తిన శ్రీధర్, దండకడియాల, శ్రీరామ్, వేములూరి బాస్కరావు.. తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collection of one crore signatures

You cannot copy content of this page

Scroll to Top