Leaders meet Former Minister : మాజీ మంత్రులను మర్యాదపూర్వకంగాకలిసిన జిల్లా మైనారిటీ సెల్ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్ 17, ఇటీవల రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి జిల్లా మైనారిటీ సెల్ కమిటీలో నియమితులైన మైనారిటీ నాయకులు మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,ని, మాజీమంత్రి తానేటి వనిత ,ని మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పదవులు లభించడానికి కృషిచేసిన వేణుగోపాలకృష్ణ ,కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు, మాట్లాడుతూ జిల్లా మైనార్టీ సెల్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎండి. హమీద్ బాషా, ప్రధాన కార్యదర్శి ఎస్.కే ఇబ్రహీం బాషా, కార్యదర్శి ఎస్కే మీరావలి, అధికార ప్రతినిధి ఎండి కరీం బాషా, రూరల్ మరియు కడియం మండల అధ్యక్షులు ఎండి మహబూబ్ బాజీ,ఎండి సర్కార్ బాషా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Minority Cell leaders respectfully meet former ministers

You cannot copy content of this page

Scroll to Top