త్రినేత్రం న్యూస్ నవంబర్ 17 ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రములోని బస్టాండ్ సెంటర్ రహదారి మధ్యలోనే ట్రాన్స్ఫార్మర్ ఉండటం స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం ప్రమాదాలకు కారణమవుతోంది ఎప్పుడు రద్దీ గ ఉండే బస్టాండ్ ఏరియా రోజు వేలాది మంది రాకపోకలు జరుపుతుంటారు ప్రధాన కేంద్రం అయినప్పటికీ రోడ్డుకు మధ్యలో నిలిచిన ఈ ట్రాన్స్ఫార్మర్‌ను మార్చడానికి అధికారుల నుండి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది
వాహనదారులు విద్యార్థులు బాటసారులు ఎప్పుడైనా ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు పలుమార్లు సంబంధిత శాఖలకు వినతులు చేసినా ఫలితం లేకపోవడం ఆవేదనగా మారింది.. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.. ట్రాన్స్ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించి, రహదారిని విస్తరించాలన్న ప్రజల డిమాండ్‌పై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజా కవి విముక్తి అన్నారు ధర్మసాగర్ బస్టాండ్ సెంటర్ ప్రజలు సమస్య ను శాశ్వతంగ ప్రరిస్కరించాలి అని విద్యుత్ అధికారులను కోరుతున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


