Collector : మెనూ ప్రకారం, విద్యార్థులకు భోజనాన్ని అందించాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ గంగారం సాయి బాబా కాలనీ నందు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ మరియు కొత్త గడి జిల్లా పరిషత్ హై స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నన భోజనాన్ని పరిశీలించారు. ఈరోజు మెనూ ప్రకారం విద్యార్థులకి పెట్టే భోజనం వంట చేయడం జరిగిందా లేదా అని పరిశీలించారు. వంట కి ఉపయోగించే వంట సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రోజు మెను ప్రకారం రుచికరమైన భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఐ ఎఫ్ టి ప్యానల్ పని విధానాన్నిపరిశీలించారు. స్టోర్ రూమ్ ని పరిశీలించి బియ్యం నాణ్య త ను చెక్ చేశారు. తాజా కూరగాయల తో విద్యార్థులకు భోజనం పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని, అందులో పదవ తరగతి చదివే విద్యార్థులు ఎంత మంది ఉన్నారని స్కూల్ ప్రిన్సిపాల్ ను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పదవ తరగతి లో అన్ని సబ్జెక్ట్ లలో ఎంత మేరకు పోర్షన్ జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజు సాయంత్రం విద్యార్థులకి స్పెషల్ క్లాసులు చెప్తున్నారా, సబ్జెక్టులలో వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి చదివే విద్యార్థులు అందరూ కూడా ఇప్పటి నుండే పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా విద్యా శాఖ అధికారి రేణుకా దేవి, ఎం ఇ ఓ బాబు సింగ్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

meals should be provided to the students

You cannot copy content of this page

Scroll to Top