గుత్తసుఖేందర్ రెడ్డి , బాలు నాయక్.
దేవరకొండ డివిజన్ నవంబర్ 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ జామియాతుల్ ఉలేమా నేత, ప్రముఖ ముస్లిం మత పెద్ద ముఫ్తి మొహమ్మద్ జావిద్ హుస్సేన్ ఖాస్మి సాహేబ్ అకస్మిక మరణం దేవరకొండ ముస్లిం సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ వార్త తెలుసుకున్న వెంటనే, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కలిసి ముఫ్తి సాహేబ్ భౌతిక దేహానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ — ముఫ్తి సాహేబ్ యొక్క సరళమైన జీవన విధానం, ఆధ్యాత్మిక సేవలను స్మరించుకున్నారు. సమాజ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిదని అభిప్రాయపడ్డారు. ముఫ్తి జావిద్ హుస్సేన్ ఖాస్మి సాహేబ్ సమాజానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని, ఆయన మరణం ముస్లిం సమాజానికి పెద్ద తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమ సానుభూతిని తెలియజేశారు.
కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు, ప్రజలు పాల్గొని ముఫ్తి సాహేబ్కు నివాళులు అర్పించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


