దేవరకొండ డివిజన్ నవంబర్ 16 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ మేకల కాశన్న – సాయమ్మ ల కుమారుడు మేకల శివ – చందన ల వివాహ మహోత్సవ వేడుకలు డిండి మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డు లో గల వీ ఏ ఎస్ కన్వెన్షన్ హాల్ యందు జరిగాయి.ఈ వివాహ వేడుక మహోత్సవమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


