MLA Roshan Kumar : రాబోయే సంక్రాంతి నాటికి రహదారులు పూర్తి

TRINETHRAM NEWS

తేదీ : 15/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా ఆర్ మరియు బి సర్కిల్ కార్యాలయంలో చింతలపూడి డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ సంబంధిత అధికారులు మరియు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ , వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు.రాబోయే సంక్రాంతి నాటికి చింతలపూడి నియోజకవర్గంలో రహదారుల పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ ఆ పనులలో జాప్యం చేయడం వల్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం రహదారి ఆరు కిలోమీటర్ల మేర రూపాయలు పది.ముప్పై కోట్ల వ్యాయంతో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సోమవారం నుండి రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆదివారం భూమి పూజ చేస్తామని రోషన్ కుమార్ పేర్కొన్నారు.
ఆడమిల్లి వంతెన డైవర్షన్ పనులు రూపాయలు ఇరువై లక్షలతో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. చింతలపూడి రావికంపాడు రోడ్డు ఆరు కోట్ల వ్యయంతో నిర్మించ నున్నారని వారం రోజులలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చింతలపూడి- ఏలూరు, మేడిశెట్టి వారి పాలెం రోడ్ల అభివృద్ధికి రూపాయలు నాలుగు.పద్నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగిందని, టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభించ బడతాయన్నారు. చింతలపూడి కామవరపుకోట రోడ్డు ఒకటి.ఎనిమిది కోట్ల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నట్లు ప్రకటించారు. రంగాపురం- తడికలపూడి, జిలకరగూడెం రోడ్ల అభివృద్ధికి రెండు కోట్ల తొంభై లక్షలు తో ప్రతిపాదన పంపామన్నారు.

చింతలపూడి పట్టణంలో మరియు ధర్మాజీగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నాలుగు కోట్లతో ప్రతిపాదన పొందామన్నారు. నియోజవర్గంలో అన్ని ముఖ్య రహదారులు సంక్రాంతి నాటికి పూర్తి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Roads to be completed by the upcoming Sankranti

You cannot copy content of this page

Scroll to Top