Minister Tummala : ఘనంగా మంత్రి తుమ్మల. జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 15/11/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి నియోజకవర్గం, మండలం, కిష్టారం గ్రామం సెంటర్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు పంచిపెట్టారు.
అదేవిధంగా లడ్డు, మిఠాయిలు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులందరికీ ఎంతో మేలు చేస్తున్నాడని వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు, చల్లగా సంతోషంగా, ఎటువంటి కష్ట, నష్టాలు రాకుండా, లేకుండా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Tummala Birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top