CM Revanth : హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ మీడియా తో చిట్ చాట్

TRINETHRAM NEWS

Trinethram News : జూబ్లిహిల్స్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయి.
ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం. ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల, ఇక్కడ పేదల సంక్షేమం పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి మా ఆలోచన, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారు. వచ్చే మూడేళ్లు ఆ దిశగా నిరంతరం పని చేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు మాకు సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.

ఎన్నికలప్పుడే రాజకీయం. వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే మా మంత్రం. జూబ్లిహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక మా బాధ్యత.

ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం. ఈ గెలుపునకు ప్రధాన భూమిక పోషించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్‌ పార్టీకి తెలియదు., GHMC ఎన్నికల్లోనూ ఇదేరకమైన ఫలితాలు సాధిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లుగా ప్రజలు నిశితంగా గమనించి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును బాధ్యతగా తీసుకుని ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి అభివృద్ధి చేస్తాం. రీజినల్‌ రింగ్‌రోడ్‌, రేడియల్ రోడ్స్‌, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా చర్యలు చేపట్టాం. సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. హైడ్రా, ఈగల్‌ ఫోర్స్‌ వంటి సంస్థలను ప్రజలకు మేలు చేయడానికి తీసుకొచ్చాం. కేంద్ర నిధులు రాబట్టుకునే విషయంలో కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hyderabad Chief Minister Revanth's Chit Chat with Media

You cannot copy content of this page

Scroll to Top