Parigi MLA : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. లక్నాపూర్‌ లో ఉచిత చేపపిల్లల పంపిణీ. పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను పరిగి ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మత్స్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి వదిలారు.*
ఈ ఏడాది నియోజకవర్గంలోని దోమ,పరిగి,పూడూరు,కుల్కచర్ల,చౌడాపూర్ మండలాల్లోని 266 చెరువుల్లో 38 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందిస్తోందని ఎమ్మెల్యే టీ రాంమోహన్ రెడ్డి వివరించారు.మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.మత్స్యకార కుటుంబాల ఆర్థిక బలోపేతం కోసం చేప పిల్లల పంపిణీ వంటి పథకాలను ప్రభుత్వం గ్రామస్థాయికి తీసుకెళ్తోందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Goal is development of fishermen

You cannot copy content of this page

Scroll to Top