Government Pensioners : దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ భవన నిర్మాణమునకు విరాళం అందజేత

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 12 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణ నిధికి గంగిడి మాధవరెడ్డి రిటైర్డ్ ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాలు రూ. 10,116లు అధ్యక్షులు కార్యదర్శి, కోశాధికారి తాడిశెట్టి నరసింహ,అంకం చంద్రమౌళి, పంగునూరు లింగయ్య లకు అందజేసినారు. ఈ సందర్బంగా దాత మాట్లాడుతూ పెన్షనర్స్ సంఘం దేవరకొండ కార్యవర్గం పెన్షనర్స్ అందరి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం చేస్తున్నారు, భవన నిర్మాణం కొరకు వారి శ్రమని వెలకట్టలేము అన్నారు. సంఘం అధ్యక్షులు, కార్యదర్శి మాట్లాడుతూ మా సభ్యుల ఆర్థిక సహకారంతోనే భవన నిర్మాణం చేపట్టినాము.

త్వరలో పూర్తిచేసి వాడుకలోకి తెస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య,జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ రెడ్డి, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసఫ్ షరీఫ్, గుమ్మడవల్లి కోటయ్య, తాడూరు సత్యం,అలంపల్లి శ్రీనివాసులు, మౌలానా, బొల్లెద్దు లక్ష్మయ్య,కర్నాటి సత్యనారాయణ, లక్ష్మణా చారి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Devarakonda Government Pensioners donate

You cannot copy content of this page

Scroll to Top