Massive Rally : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ, భారీ ర్యాలీ

TRINETHRAM NEWS

మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో, కలెక్టర్ కు వినతి పత్రం

పేదవాడికి విద్య వైద్యం దూరం చేయాలనే దురుద్దేశంతో, కూటమి ప్రభుత్వం

వైసిపి జిల్లా కార్యదర్శి, తడాల విష్ణు చక్రవర్తి

త్రినేత్రం న్యూస్ నవంబర్, 12. కడియం : నిరుపేద విద్యార్థులకు సైతం వైద్య విద్య అందాలనే జగనన్న దృఢ సంకల్పానికి తూట్లు పొడుస్తూ, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దారుణమని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే పిపిపి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, తప్పుడు పరిపాలనా విధానాలను మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో, కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడానికి, కడియం మండలం, బుర్రిలంక గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బొమ్మూరు వైసిపి కార్యాలయానికి వెళుతున్నట్లు చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలందరూ బొమ్మూరు వైసిపి కార్యాలయానికి చేరుకుంటారని, అక్కడి నుండి భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి వినతిపత్రం సమర్పిస్తారని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive rally against privatization of medical colleges

You cannot copy content of this page

Scroll to Top