Manda Ranjith Kumar : జేఎన్టియుహెచ్ లో మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

TRINETHRAM NEWS

డాక్టరేట్ అందుకున్న మంద రంజిత్ కు శుభాకాంక్షలు తెలిపిన యాకన్న
•కృషికి ప్రతీకగా మరో మైలురాయి.

కూకట్పల్లి ప్రతినిధి, నవంబర్ 12, (త్రినేత్రం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని అగ్ర సాంకేతిక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ,హైదరాబాద్ ( జేఎన్టీయూహెచ్) నుండి ఎనర్జీ సిస్టమ్స్ విభాగంలో డాక్టరేట్ డిగ్రీను మంద రంజిత్ కుమార్ 2025 నవంబర్ 11న పొందడం గర్వకారణం.డిజైన్ అండ్ ఎనాలిసిస్ అఫ్ ఎస్పివి సిస్టంస్ ఫర్ హయ్యర్ ఎలక్ట్రికల్ ఔటపుట్ విత్ డిఫరెంట్ ఎంపీపీటీ టెక్నిక్యూస్ అనే అంశంపై ఆయన విలువైన పరిశోధన చేశారు.ఈ పరిశోధనను విశ్వవిద్యాలయ రెక్టర్ డా. కె.విజయ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు.మంద రంజిత్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలురుపాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాల (జడ్పీహెచ్ఎస్) లో ప్రాథమిక విద్యనభ్యసించి,10వ తరగతిలో మండలంలో రెండవ ర్యాంక్ సాధించారు.

తరువాత కొత్తగూడెం నలందా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 920 మార్కులు సాధించి, ఎంసెట్ ద్వారా పాల్వంచాలోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) శాఖలో బి.టెక్ సీటు పొందారు.బి.టెక్ సమయంలోనే ఆల్ ఇండియా గేట్ పరీక్షలో అద్భుత ర్యాంక్ సాధించి,జేఎన్‌టీయూహెచ్ విశ్వవిద్యాలయంలో ఎం.టెక్ సీటు పొందారు.ఎం.టెక్‌ను జేఎన్‌టీయూహ్‌లో విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం, మళ్లీ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్ ఆధారంగా జేఎన్‌టీయూహ్‌లోనే పీహెచ్.డి ప్రవేశం పొందడం ఆయన విద్యా ప్రయాణంలో మరో గొప్ప ఘట్టంగా నిలిచింది.విద్యార్థి జీవితంలో ఆయన కేవలం విద్యార్థిగా మాత్రమే కాకుండా విద్యార్థి నాయకుడిగా ఎదిగి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలిచారు.

విశ్వవిద్యాలయంలోని టీచింగ్,నాన్-టీచింగ్ సిబ్బంది,విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ, జేఎన్‌టీయూహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా విలువైన సేవలు అందించారు. తదుపరి,ఆయన జేఎన్‌టీయూహెచ్ జేఏసీ చైర్మన్ పదవికి కూడా నియమితులయ్యారు.విద్యార్థి ఉద్యమాలతో పాటు తన పరిశోధనలో కూడా పట్టుదలతో కొనసాగి, నేడు డాక్టరేట్ డిగ్రీ సాధించడం ఆయన కృషి, క్రమశిక్షణ, అంకితభావానికి ప్రతీక. అంతేకాకుండా మంద రంజిత్ కుమార్ ఒకే కమ్యూనిటీతో కాకుండా అన్ని కమ్యూనిటీలతోనూ మంచినడవడి,పరస్పర గౌరవభావం కొనసాగిస్తూ,తన పుట్టిన కమ్యూనిటీకి న్యాయం జరిగేలా అనేక పోరాటాలు చేశారు.సమాజంలోని అన్ని వర్గాలతో సమానమైన సంబంధాలు కొనసాగిస్తూ, ఐక్యత, సామాజిక సమానత్వం కోసం తనదైన రీతిలో కృషి చేస్తున్నారు.

తన విద్యా ప్రయాణం మాత్రమే కాదు, సమాజం పట్ల కూడా ఆయనకు ఉన్న నిబద్ధత ప్రశంసనీయం.తన మాల కమ్యూనిటీ అభ్యున్నతి కోసం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, సమాజ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.జేఎన్‌టీయూహెచ్ జేఏసీ కమిటీ మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరఫున మంద రంజిత్ కుమార్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ,భవిష్యత్తులో ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు.మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య,రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఎం.ఆర్‌.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ పొందిన మంద రంజిత్ కుమార్ కి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎర్ర యాకన్న శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కోశాధికారి పుట్టి నగేష్,జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు నేత,సభ్యులు రామారావు, దేవేందర్ రెడ్డి, పంతం వెంకటేష్,రాజు,హేమంత్ కుమార్ తదితరులు పాల్గొని ఆయనకు అభినందనలు అందజేశారు.ఈ కార్యక్రమం విద్యా రంగంలో ఆయన సాధనను గుర్తించి,స్థానిక సంఘ సమితులు,ప్రముఖులు ఆయన కృషికి గౌరవం చూపిన సందర్భంగా నిలిచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Manda Ranjith Kumar awarded doctorate

You cannot copy content of this page

Scroll to Top