CPM : చెర్లోపల్లి దారి ఏర్పాటు చేయాలని గంగిరెద్దుకు వినతిపత్రం ఇచ్చిన సీపీఎం నేతలు

TRINETHRAM NEWS

స్పందించకపోతే పోరును ఉదృతం చేస్తాం.

సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ హెచ్చరిక

Trinethram News : కడప జిల్లా అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పనిజంగా సమస్యలు పరిష్కరించడం లేదని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ తీవ్రంగా విమర్శించారు.

గత ఎనిమిది నెలలుగా చెర్లోపల్లి లేఔట్ లో రహదారి సమస్యను పరిష్కారం చేయాలని అనేక రూపాల్లో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదన్నారు. దీన్ని నిరసిస్తూ సోమవారం నాడు కడప నగరంలోని బాలాజీ నగర్ లో గంగిరెద్దుకు వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ కడప శివారు ప్రాంతంలో ఉన్న చేర్లోపల్లి లేఔట్ పరిధిలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రధానంగా లేఅవుట్ కు తూర్పు వైపున ఉన్న 500 కుటుంబాలకు ఇప్పటివరకు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్లడానికి దారి సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు.

ఈ దారి ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగినా ఫలితం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, సమయాన్ని కాలయాపన చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అటు కార్పొరేషన్, ఇటు రెవెన్యూ, ఇంకోవైపు హౌసింగ్ అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పి సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే రహదారిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనేకసార్లు విజ్ఞప్తి చేసిన పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామని మాటలు చెబుతున్నారు తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. సమస్యను ఇదే పద్ధతిలో నిర్లక్ష్యం చేస్తూ పోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిపిఎం పార్టీ శ్రీకారం చుడుతుందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరి రెడ్డి, నగర కమిటి సభ్యులు చంద్రారెడ్డి, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, నరసింహ, విజయ్, రవి, శ్రీనువాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPM leaders have submitted a petition

You cannot copy content of this page

Scroll to Top