Free Google Gemini Plan : 25+ ఏళ్ల జియో యూజర్లకూ ఫ్రీ గూగుల్ జెమినీ ప్లాన్‌

TRINETHRAM NEWS

Trinethram News : ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) తన యూజర్లకు ఉచితంగా అందిస్తున్న గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను ఇప్పుడు అన్ని వయసుల వారికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత 18 నుంచి 25 ఏళ్ల వయస్కులకు మాత్రమే అందించిన ఈ ఆఫర్.. తాజాగా 25 ఏళ్ల పైబడిన వారికి సైతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మై జియో యాప్‌ ద్వారా ఈ ప్లాన్‌ను క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఈ ఆఫర్‌లో భాగంగా రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్‌ 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌ పొందాలంటే అపరిమితి 5జీ ప్లాన్‌ యాక్టివేట్‌ చేసుకుని ఉండాలి. అంటే నెలకు కనీసం రూ.349తో రీఛార్జి చేసిన వారికే ఈ ప్లాన్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా జెమిని 2.5 ప్రో మోడల్‌, 2జీబీ క్లౌడ్‌ స్టోరేజీ, వియో 3.1 వీడియో జనరేటర్‌, నానో బనానా ఇమేజ్‌ జనరేషన్‌ వంటి ఫీచర్లు లభించనున్నాయి. వీటితో పాటు నోట్‌బుక్‌LM, జెమిని కోడ్‌ అసిస్ట్‌, జీమెయిల్‌, డాక్స్‌లో జెమిని సేవలు ఈ ప్లాన్‌లో భాగంగా పొందొచ్చు. మై జియో యాప్‌లో ‘క్లెయిమ్‌ నౌ’ బ్యానర్‌ క్లిక్‌ చేసి ఈ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మరికొందరికి మాత్రం ‘రిజిస్టర్‌ ఇంట్రెస్ట్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తోంది. దశలవారీగా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free Google Gemini plan for Jio users

You cannot copy content of this page

Scroll to Top