Indrasena Reddy : రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోకపోతే

TRINETHRAM NEWS

కఠిన చర్యలు గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని 1 టౌన్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఈరోజు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవన శైలి గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, గొడవలకు, దాడులకు, బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించేవారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సెలింగ్‌ చేశారు.

సత్ప్రవర్తన కలిగినవారిపై రౌడీషీట్లను తొలగించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో ఎస్ఐ భూమేష్, సిబ్బంది పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

If the rowdy sheeters do not change their ways

You cannot copy content of this page

Scroll to Top