కలెక్టర్ కు జె ఏ సి వినతి…
త్రినేత్రం న్యూస్, నవంబర్ 06, మండపేట నియోజక వర్గన్నీ రాజహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా లో కలపాలని మండపేట జె ఏ సి కన్వీనర్ కామన ప్రభాకరరావు, చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, ఎమ్మార్పీఎస్ నాయకులు ధూళి జయరాజు, సి ఐ టీయూ నాయకులు కే కృష్ణ వేణి, బిజెపి నాయకులు కోన సత్యనారాయణ లు కోరారు. ఏడిద విచ్చేసిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వారిని కలెక్టర్ కు పరిచయం చేశారు. ఇక్కడి ప్రాంతం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన సమయం లో తామంతా విలీనం కోసం రోడ్ ఎక్కి ఆందోళన లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.అప్పటి నాయకుల అలసత్వం వల్ల జిల్లా పునర్విభజన లో మండపేట కు అన్యాయం జరిగిందన్నారు.
ఇక్కడి ప్రజలు తాము ఈ జిల్లాలో ఉండం, తూర్పు గోదావరి జిల్లా లో విలీనం చేయాలనే తమ ఆకాంక్షను వెల్లడిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఎన్నికల ముందు, ఇపుడు జె ఏ సి కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 7 న జరిగే కేబినెట్ సమావేశం లో జిల్లాల పునర్విభజన పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అధికారులు విలీనం కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. ఇక్కడ పనిచేసే అధికారులు ఇక్కడ శాశ్వతంగా ఉండరని ఇక్కడి ప్రజలే ఇక్కడ నివసిస్తున్నారు. విలీనం చేపట్టి ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్తాయి గా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం లో జె ఎ సి సభ్యులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


