కూకట్పల్లి నవంబర్ 5 (త్రినేత్రం న్యూస్) : 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ లోని అపోస్టోలిక్ ఫైర్ వర్షిప్ మినిస్ట్రీస్ చర్చిలో క్రిస్టియన్ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన శేరిలింగంపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశానికి ముఖ్యఅతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై సభలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ క్రిస్టియన్ ఫెలోషిప్ సమావేశంలో పాస్టర్స్ అందరిని ఒకే వేదికమీద కలవడం ఆనందంగా ఉందని అన్నారు.
విచ్చేసిన పాస్టర్లకు, సమావేశాన్ని ఏర్పాటుచేసిన నిర్వహికులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోశెట్టిగౌడ్, రాందాస్ గౌడ్, యాదగిరి, సంగమేష్, రాజుగౌడ్ , పాస్టర్స్ శామ్యూల్ కోకిల, ఆర్.డి ప్రసాద్, టి.ఆర్.రాజు, ఎమ్. సత్యరాజు, నాగభూషణం, దేవదాస్, శామ్యూల్, ముకేశ్, కమలాకర్, జెర్మయ్య, నూతనబాబు, జాన్ ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


