Tadala Vishnu Chakravarthy : ద్రాక్షారామ లో భక్తులకు మొక్కలు పంపిణీ చేసిన తాడాల విష్ణు చక్రవర్తి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, నవంబర్,03. కడియం మండలంలోని బుర్రిలంక గ్రామానికి చెందిన ఈశ్వరీ పాం నర్సరీ యజమాని టివిసి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి కార్తీకమాసం పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం వద్ద ఒక లారీ మొక్కలు ఆలయానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు.
తులసి, కృష్ణ తులసి, మారేడు, జామ, నందివర్ధన, తదితర రకాల మొక్కలను కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అందజేశారు. గత శివరాత్రి సమయంలో శ్రీశైలం లో లక్ష మొక్కలను భక్తులకు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద కూడా గతంలో రెండు లారీలు మొక్కలను పంపిణీ చేశారు. తాజాగా ఈ సోమవారం ద్రాక్షారామం ఆలయం వద్ద కార్తీకమాసం సందర్భంగా ఈ మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ అల్లు దుర్గా భవాని, యస్. వెంకన్న బాబు (సూపర్డెంట్) తాడాల కృష్ణ కుమార్, తాడాల అర్జున్, కర్రి భీమశంకర్, కర్రి శివన్నారాయణ, ఆనాల రాజుబాబు, ధవలూరి సత్తిబాబు, సిద్దా గోపాలకృష్ణ, సుంకర లక్ష్మీనారాయణ, తాడాల ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tadala Vishnu Chakravarthy distributing

You cannot copy content of this page

Scroll to Top