జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 23 at 9.14.10 AM

TRINETHRAM NEWS

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది. నేడో.. రేపో విడుదల చేసే అవకాశం

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది.ఈ రోజు కూడా అనేక మంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లిందని తెలిసింది. దాంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే,ఎంపీ లు క్యూ కడుతున్నారు. ఈ రోజు లేదా రేపటి లోపు మార్పులు, చేర్పులు చేసి ఆ తర్వాత 5వ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఐతే ఈసారి ఎన్ని నియోజక వర్గాల్లో మార్పులు,చేర్పులు చేస్తారన్నది తెలియక వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది.

ఇప్పటికే 4 విడతలగా నియోజక వర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. దాదాపు 58 శాసనసభ నియోజకవర్గాలు,10 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్దులును మార్చారు. కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం కల్పించగా, కొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్పు జరిగినది.

ఈ రోజు, రేపు పూర్తి స్థాయి కసరత్తు చేసి 25 లోపు 5వ జాబితా విడుదల చేసి వారిని ఎన్నికలకు సిద్ధం చేసి ఈ నెల 27న భీమిలి లో జరిగే సభతో ఎన్నికల సమరానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

You cannot copy content of this page