విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్

TRINETHRAM NEWS

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్

ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ

  • అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి

విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి చెప్పారు.

ఆమె సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్‌ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని, భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.

వడ్లపూడిలో రైల్వే­స్థలం 100 ఎకరాలు ఉండగా, జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని రైల్వే అధికారులకు అప్పగించినట్లు వివరించారు.

సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు ఓఎస్‌డీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో నియమించిందని పేర్కొ­న్నారు.

You cannot copy content of this page

Scroll to Top