తక్షణమే కాస్మొటిక్,మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయాలి
ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ .
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 30 త్రినేత్రం న్యూస్. ఎస్సీ,బీసీ,ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు మెనూ సక్రమంగా అమలు చేయాలని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని బీసీ హాస్టల్ ను బిఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….ప్రభుత్వ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ఆయన కోరారు.ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అద్వానంగా ప్రభుత్వ హాస్టల్ మారుతున్నాయి అని ఆయన అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన ప్రభుత్వ హాస్టల్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి అని ఆయన ఎద్దేవా చేశారు. తక్షణమే కాస్మొటిక్,మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయాలి అని డిమాండు చేశారు.బీసీ,ఎస్టీ, ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ ను ప్రభుత్వం గాలికి వదిలి వేసింది అని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్వీ మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్, చాట్ల ప్రశాంత్,అనిల్, వెంకటేష్, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


