MLA Vegulla : అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

TRINETHRAM NEWS

షెల్టర్ హోమ్స్ సిద్ధం చేశాం

అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 27, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు, తీసుకుంటుందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన, అవసరం లేదని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, తెలిపారు. మండపేట లో ఆయన మీడియా తో మాట్లాడుతూ మండపేట నియోజవర్గానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నప్పటికీ నియోజకవర్గం లోని మూడు మండలాలు, పట్టణంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తాటాకు ఇళ్లల్లో ఉండే వారి సమాచారం అధికారులు ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నారన్నారు. తగు సమయంలో వీరిని ఆయా కేంద్రాలకు అవసరాన్ని బట్టి తరలించడం జరుగుతుందన్నారు.

నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణం లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కపిలేశ్వరపురం మండల ప్రజలు 93811 45177 నెంబర్ లోనూ మండపేట మండల ప్రజలు 7989997185 నెంబర్ లోనూ, రాయవరం మండల ప్రజలు 9618006344 నెంబర్ లోనూ, మండపేట పట్టణ ప్రజలు 9849906527 నెంబర్ లోనూ అత్యవసర సమయాల్లో, సంప్రదించవచ్చన్నారు. ఎటువంటి సమస్యను అయినా ఎదుర్కొందుకు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే వేగుళ్ళ కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We are taking all precautions

You cannot copy content of this page

Scroll to Top