వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామం ఆర్ అండ్ బి రోడ్డు అంగడి చిట్టంపల్లి గేట్ – కంకల్ – లాల్పహాడ్ రోడ్డు రోడ్డు పనులు పూర్తికాక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కంకల్ గ్రామం బీర్ ఫ్యాక్టరీ దగ్గరలో పూర్తిగా పాడై పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి కార్లు బైకులు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కార్ల యొక్క ఇంజన్ విడిభాగాలు విరిగిపోయి ఆయిల్ కారిపోయే పరిస్థితికి వచ్చింది అంటే రోడ్డు పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కొన్ని వందల భారీ వాహనాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా రాకపోకలు జరుగుతాయి. కానీ ఈ రోడ్డులో చీకట్లో ఎవరైనా వస్తే ఈ రోడ్డు సరిగ్గా లేక కిందపడి వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు అనేటువంటిదే నా ప్రశ్న..? అంతేకాకుండా ఇప్పటివరకు చాలామంది కూడా ఈ రోడ్డుపైన చనిపోయి, కొంతమంది ఆసుపత్రుల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కాబట్టి ప్రభుత్వం, ఆర్ అండ్ బి అధికారులు, బీర్ కంపెనీ వాళ్ళు దీని గురించి ఆలోచించి త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టాలి. ఈ రోడ్డు పనులు చితంపల్లి గేటు వరకు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు బ్రిడ్జి దగ్గర కూడా రోడ్డు బాలేకపోతే నిరసన తెలిపితే వాటికి ఇంత కొంత మట్టి పోసి వాటిని కొంతవరకు రాకపోకలకు మరమ్మత్తులు చేశారు మళ్లీ ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద గుంతలు ఏర్పడ్డ కూడా ఈ కంపెనీ వాళ్ళు గాని ఆర్ అండ్ బి అధికారులు గానీ కనీసం ఇక్కడ తొంగి కూడా చూస్తలేరు. దయచేసి అధికారులందరూ ఒక్కసారి గమనించి ఈ రోడ్డుని కనీస మరమ్మతులను చేసి రాకపోకలకు మరమ్మతులు చేసి మా ప్రాణాలను తర్వాత మా వాహనాలను కాపాడుతారని కోరుకుంటున్నాం. లేదంటే కచ్చితంగా అతి త్వరలో ధర్నా చేపడతామని హెచ్చరిస్తున్నాం.
అలాగే కంకల్ – రాకంచెర్ల రోడ్డు పరిస్థితి కూడా దారుణంగా తయారైంది ఈ రోడ్డులో నాలుగు చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి అక్కడ కూడా వాహనాలకు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పంచాయతీరాజ్ అధికారులకు ఈ విషయమై మాట్లాడటం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలోనే ఈ మరమ్మత్తులను చేపడతామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


