Andhra Lawyers Association (ALA) : న్యాయవాదుల హక్కులు హరించే కుట్రపై ” ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) వాజ్యం దాఖలు చేసింది

TRINETHRAM NEWS

ఎమ్. వి రాజారామ్
అధ్యక్షులు

మేడా శ్రీనివాస్ ,
ప్రధాన కార్యదర్శి ,

ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, రాజమహేంద్రవరం, బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సామాన్యులు పోటీచేయకుండా ఖరీదైన ఎన్నికలుగా మార్చే కుట్రను ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (అలా) అధ్యక్షులు ఎమ్ వి రాజారామ్, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ సంయుక్తంగా ఎదుర్కొంటున్నారు.
బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీచేయాలనుకునే అభ్యర్థి రుసుమును 1,25,000/- కు పెంచేసారు . పైగా నాన్ రిటర్న్బుల్ ఎమౌంట్ గా మార్చేశారు . ఒక కార్పొరేట్ వ్యాపార లాభదాయక పరిశ్రమగా బార్ కౌన్సిల్ ఎన్నికలను కలుషితం చేయటం బాదాకారం . ఈ కుట్ర చర్య న్యాయవాదుల భద్రత, సంక్షేమం , భవిష్యత్ పై కాల కూట విషం చిమ్మటం వంటిది . అభ్యర్థి రుసుమును 2000/- లకు కుదించమని , అమాంతం పెంచిన 1, 25 ,000/- రుసుమును రద్దు చేయమని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది
ఎమ్. వి రాజారామ్ , న్యాయవాది మేడా శ్రీనివాస్ ఏపి హై కోర్టులో వాజ్యం దాఖలు చేసారు . ఈ వాజ్యంలో శ్రీ ఎమ్. వి రాజారామ్ ప్రత్యేక వాదనలు వినిపించునున్నారు . రోజుల వ్యవది లోనే వాజ్యం విచారణకు వస్తుంది . అంత పెద్ద మొత్తంలో లక్షల్లో పెట్టుబడి పెట్టి పోటి చేయదలిచిన అభ్యర్థి న్యాయవాదుల సమస్యలకు అండగా నిలిచి వారికి న్యాయం చేయగలరా ! పెట్టిన పెట్టుబడికి అవినీతి చర్యలకు మార్గం చేసుకుంటారా ! అనే ఘటనపై విజ్నులైన సహచర న్యాయవాదులు ఆలోచించి ” ఆలా ” పోరాటానికి అండగా నిలవాలని వారు కోరారు.
అడ్వకేట్స్ భద్రత, సంక్షేమం, భవిష్యత్ ప్రధాన లక్ష్యంగా “ఆలా” పని చేస్తుందని , అడ్వకేట్స్ కు సమస్యలు, వారికి అవసరమయ్యే చట్ట పరమైన సహాయ సహకారలు , కొన్ని ఇతర ముఖ్య సమస్యలపై త్వరలో ఆలా అధ్యక్షులు రాజారామ్, సారద్యం ఒక ముఖ్య సమావేశం నిర్వహించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని , న్యాయవాదులు మా ప్రయత్నానికి వెన్ను దన్నుగా నిలిచి న్యాయవాదుల భద్రతకు, సంక్షేమానికి సహకరించగలరని కోరుచున్నాము. త్వరలో జరగబోయే భార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోబాలకు తలోగ్గవద్దని విజ్నులైన న్యాయవాదులను కోరుచున్నాము.
ఇప్పటికే న్యాయవాదులకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో ఆలా అధ్యక్షులు , సీనియర్ న్యాయవాది ఎమ్. వి రాజారామ్ ప్రత్యేక వాజ్యాన్ని దాఖలు చేసి ఉద్యమ పాదయాత్ర పోరాట బాటకు న్యాయస్థానం ద్వారా అనుకూలమైన ఆదేశాలు సాధించటం కూడా న్యాయవాదుల విజయంగా భావించాలి . ఖచ్చితంగా ఆలా కృషితో రాజారామ్ న్యాయవాదుల భద్రతకు అవసరమయ్యే ప్రత్యేక భద్రతా చట్టం సాధిస్తారని ఈ సందర్బంగా ధీమా వ్యక్తం చేసారు.
న్యాయవాదులకు ఎదురయ్యే సమస్యలు అక్రమ కేసులు పట్ల ఆలా అండగా నిలుస్తుందని , బాధిత న్యాయవాదికి అంతిమ న్యాయం జరిగే వరకు ఆలా నిలుస్తుందని ఈ సందర్బంగా వారు భరోసా ఇచ్చారు . బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటి చేయుటకు బారిగా లక్షల్లో పెంచిన అభ్యర్థుల ఫీజు రుసుమును తక్షణమే రద్దు చేసి సామాన్యులు సైతం పోటి చేయుటకు వీలుగా 2000/- రుసుమును నిర్ణయించే దిశగా చర్యలు అమలు చేయాలి . రాజారామ్, కృషితో మెరుగైన మంచి సంస్కరణలతో ఆదేశాలు న్యాయస్థానం నుండి విలువడతాయని వారు ఆశాబావం వ్యక్త పరిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

"Andhra Lawyers Association (ALA) files suit against conspiracy

You cannot copy content of this page

Scroll to Top