డిండి ( గుండ్లపల్లి ) అక్టోబర్ 23 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో గ్యార్వీ షరీఫ్ ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయని ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ వుమర్ తెలిపారు. సాయంత్రం శాధిఖాన నుండి గంధం ఊరేగింపు మహబూబ్ సుభాని దర్గా వద్దకు చేరుకుంటుందని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.నిర్వాహకులు దర్గాను సుందరంగా విద్యుత్ ద్వీపాలు ,పూలతో అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాల్లో,మరియు అన్నదాన కార్యక్రమం లో ప్రజలు పాల్గొనాలనీ ఆయన పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


