Trinethram News : Oct 23, 2025, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహాలపై క్లస్టర్ ఇన్‌చార్జులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఇంచార్జిలు హాజరుకానున్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


