Record-Breaking Donations : రికార్డు స్థాయిలో విరాళాలు

TRINETHRAM NEWS

తేదీ : 22/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి భక్తుల నుంచి గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో తొమ్మిది వందల పద్ధెనిమిది కోట్ల రూపాయల విరాళాలు అందాయి. వీటిలో అన్న ప్రసాదం ట్రస్టుకు రూపాయలు మూడు వందల ముప్పైతోమ్మిది కోట్లు, శ్రీ వాణి ట్రస్టుకు రూపాయలు రెండు వందల యాభై రెండు కోట్లు వచ్చాయి. ఆన్లైన్లో రూపాయలు ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్లు, ఆఫ్లైన్లో రూపాయలు మూడు వందల ముప్పైతోమ్మిది కోట్లు విరాళాలుగా సమకూరాయి.
కోటి రూపాయలకు పైగా ఎనబై నాలుగు మంది భక్తులు విరాళాలు అందించడం జరిగింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఆ ప్రాంతంలోని జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద జలపాతం ఉదృతంగా ఉన్నందున పుష్కరిణిలో స్నానానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించడం లేదు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Record-breaking donations

You cannot copy content of this page

Scroll to Top