Collect one Crore Signatures : దామిరెడ్డిపల్లి గ్రామ రచ్చబండ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు చెల్లు బోయిన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 21. కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు అట్టహాసంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు…. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విచ్చలవిడిగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా నకిలీ మధ్యాన్ని తయారు చేస్తున్నారని దీనివల్ల చాలామంది అమాయక ప్రజలు తాగి వారి ప్రాణాలు కోల్పోతున్నారని వారి కుటుంబాలను అనాధలు చేస్తున్నారని, ప్రతిపక్షం మీద బురద జల్లడం తప్ప రాష్ట్రంలో అధికార పార్టీ చేసింది ఏమీ లేదని ఈరోజున రోడ్ల దుస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందని, ప్రచారంలో ముందు ఉన్న అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల స్వామి నాయుడు,మండల అధ్యక్షులు యాదవుల స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు,పార్టీ సీనియర్ నాయకులు నక్క రాజబాబు,నియోజవర్గ పరిశీలన నక్క నగేష్,గ్రామ ముఖ్య నాయకులు నందపనేటి గంగారావు,బుడ్డిగ పండు,చింతపర్తి రాంబాబు,చింతపర్తి చిట్టిబాబు,జాన్ బాబు నరమామిడి గణేష్ టీవీ ప్రసాద్,తాడాల చక్రవర్తి,కొత్తపల్లి శివాజీ,ఈలి గోపాలం,ఉట్టికూరి శైలజ,సాప్పిరెడ్డి సూరిబాబు,సాపిరెడ్డి కామేష్, పోరాటి శీను,సంగీత వెంకటేశ్వరరావు,చొల్లంగి సత్య గిరి,కొల్లి నాని, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chelluboina at the Damireddypalli village Rachhabanda program

You cannot copy content of this page

Scroll to Top