వైసీపీపై బురదచల్లడం తప్ప కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
రచ్చబండ, కోటి సంతకాల సేకరణలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేణు
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 21. కడియం మండలం కడియ పూలంక పంచాయతీ, రాష్ట్రంలో 2024 ఎన్నికల సమయంలో అధికారం దక్కించుకునేందుకు ఇష్టారాజ్యంగా బూటకపు హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో మంగళవారం అట్టహాసంగా వైసీపీ శ్రేణులు రచ్చబండ-కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో అమాయక ప్రజలను మోసం చేసారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి కుటుంబాలను అనాధలు చేస్తున్నారని, ప్రతిపక్షం మీద బురద జల్లడం తప్ప రాష్ట్రంలో అధికార పార్టీ చేసింది
ఏమీ లేదని, ప్రచారంలో టాప్, అభివృద్ధిలో వీక్ అన్న చందంగా చంద్రబాబు సర్కార్ పాలన సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం గుప్పించిన హామీలకు ఆశపడి ప్రజలు వారిని గద్దెనెక్కించారని, తీరా ఏడాదిన్నర పాలన ముగియకుండానే తాము చేసిన తప్పుకు చింతిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల స్వామి నాయుడు, మండల అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పార్టీ సీనియర్ నాయకులు నక్కా రాజబాబు, నియోజవర్గ పరిశీలకులు నక్కా శ్రీ నగేష్, జిల్లా వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి, తిరుమలశెట్టి శ్రీను, వెలుగుబంటి అచ్యుత రామయ్య, గారపాటి బుజ్జిబాబు, అయినవిల్లి వెంకటేశ్వర్లు, నందపునీడి గంగారావు, ఈలి గోపాలం, ఊటుకూరి శైలజ, సరితారాణి, చింతపర్తి రాంబాబు, సాపిరెడ్డి సూరిబాబు, సంగీత వెంకటేశ్వరరావు, ఆకుల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


