Congress supports BC Band : బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి ప్రభుత్వం — బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు.

TRINETHRAM NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం, మండలంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీలు గుమ్మడవల్లి, నందిపాడు, కోయ రంగాపురం, ఆసుపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రియాశీలక సభ్యులు బండి చెన్నారెడ్డి, ఎస్ సూర్యప్రకాష్, కె లింగయ్య, డీ వెంకటేష్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ హస్తం పేదల నేస్తం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నాణ్య రకమైన సన్నబియ్యము, తదితర సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయని తెలిపారు.

ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మేము చేసే పరిష్కారం మేము చేస్తున్నాము, ఆ సమస్యలకు పరిష్కారం ఎవరు చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం శాసనసభ్యులు జారే. ఆదినారాయణ ను గెలిపించుకున్నందుకు మాకు జన్మ ధన్యమైపోయిందని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణమే స్పందిస్తున్నారని సంతోషం వ్యక్తపరిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుందని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress supports BC bandh.

You cannot copy content of this page

Scroll to Top